MP | విభాగ్ స్థాయి ఖేల్ ఖూద్ కు సర్వం సిద్ధం

MP | విభాగ్ స్థాయి ఖేల్ ఖూద్ కు సర్వం సిద్ధం
- ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పవార్ రామారావు హాజరు
MP | ముధోల్, ఆంధ్రప్రభ : నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో శ్రీ విద్యాపీఠం తెలంగాణ ప్రాంతం ఆధ్వర్యంలో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల (విభాగ్ స్థాయి) ఖేల్ కూద్ (ఆటలు పోటీలు )లకు సర్వం సిద్ధమైనట్లు నిర్వాహకులు తెలిపారు. నిర్మల్ జిల్లా ఉపాధ్యాక్షులు ధర్మపురి సుదర్శన్ మాట్లాడుతూ… ఈ ఖేల్ కూద్ లో నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలల నుండి సుమారుగా 600మంది విద్యార్థులు పాల్గొననున్నారు.

ఈ ఖేల్ కూద్ శనివారం (రేపు) మధ్యాహ్నం 2:00 గం.లకు ఉద్ఘాటన కార్యక్రమానికి అతిథులుగా ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, ముధోల్ శాసన సభ్యులు పవార్ రామారావు పటేల్, నిర్మల్ జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న, శ్రీ సరస్వతి విద్యాపీఠం విభాగ్ అధ్యక్షులు భజరంగ్ లాల్ అగర్వాల్ పాల్గొననున్నారు. ఖేల్ ఖూద్ ప్రముఖ్ వర్ని వెంకట రమణ మాట్లాడుతూ… శిశుమందిరాల విద్యార్థులు సంకులం స్థాయి, జిల్లా స్థాయిలో గెలిచి విభాగ్ స్థాయిలో పోటీపడేందుకు విద్యార్థులు వస్తున్నారన్నారు. ఈ ఖేల్ ఖూద్ లో 17 రకాల ఆటల పోటీలు జరుగుతాయన్నారు.

రెండు రోజుల ఆటల పోటీలలో రెండు జిల్లాల నుండి వస్తున్న క్రీడాకారుల కోసం వసతి ఏర్పాటు చేశామన్నారు. ఈ ఖేల్ కూద్ ను వీక్షించడానికి ముధోల్ మండల కేంద్రంలోని ప్రజలతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు ఇదే తమ ఆహ్వానంగా భావించి విచ్చేయాలని పాఠశాల సమితి, ప్రబంధకారిణి సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ధర్మపురి సుదర్శన్, పాఠశాల అధ్యక్షులు కొండావార్ సంజీవ్, ఖేల్ ఖూద్ సహా ప్రముఖ్ చక్రపాణి, పిఈటి లు, వ్యవస్థ ప్రముఖ్ లు, పాఠశాల కార్యదర్శి వేదపాఠక్ నిశికాంత్, ప్రధానాచార్యులు సారథి రాజు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
