MP | ప్రజా సమస్యలు గాలికొదిలి

MP | ప్రజా సమస్యలు గాలికొదిలి
- మెస్సితో ఈవెంట్స్ మోజులో ముఖ్యమంత్రి
- మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
MP | కమలాపూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలను పక్కనపెట్టి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నాశనం చేస్తూ ఈవెంట్ మోజులో పడ్డాడని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender) ఆరోపించారు. సింగరేణి కార్మికుల క్వార్టర్లు రిపేరు చేయలేని ముఖ్యమంత్రి వారి డబ్బుతో ఈవెంట్ పై ఖర్చు చేస్తూ బాధ్యత గల ముఖ్యమంత్రి స్పోర్ట్స్ మెన్(Sportsmen) లా వ్యవహరిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని మండిపడ్డారు.
శనివారం కమలాపూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈటల మాట్లాడారు. రాష్ట్రానికి మెస్సిని రప్పించి ఈవెంట్ పేరుపై కోట్ల రూపాయలు వృధా చేస్తున్నాడని ముఖ్యమంత్రి తీరుపై మండిపడ్డారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కమలాపూర్ మండల ప్రజలు బీజేపీ అభ్యర్థులను చేరదీసి భారీ మెజార్టీ(A huge majority)తో గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన అభ్యర్థులు లక్షల కోట్లు ఖర్చు చేసినా ప్రజలు డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా ధర్మానికి మద్దతు ఇచ్చారని తెలిపారు. స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన సర్పంచ్ సభ్యులను ఐదు లక్షల నుండి 10 లక్షలు ఇస్తామని ఆశలు చూపిస్తూ పార్టీలో చేరాలని ప్రయత్నిస్తున్న ఆయా పార్టీ నాయకుల ప్రజా ప్రతినిధుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం(Expressing extreme anger) చేస్తున్నట్లు ఈటెల ఈ సందర్భంగా తెలిపారు.
