MOU | జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ అంకురార్పణ

MOU | జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ అంకురార్పణ

ఎంవోయూ మార్పిడి

MOU | విశాఖపట్నం, ఆంధ్ర ప్రభ బ్యూరో : ​భారతదేశంలోనే మొట్ట మొదటి జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటుకు సంబంధించిన అంకురార్పణ, ఎంవోయూ మార్పిడి కార్యక్రమం విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో అట్టహాసంగా జరిగింది. ​ముఖ్య అతిథులుగా ​గోవా గవర్నర్,​ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు, ​ఏపీ అసెంబ్లీ (Ap Asembly) స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ​కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు,​ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఎం.ఎస్.ఎం.ఈ.,సెర్ప్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్,​జీఎంఆర్ రాజు ​పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాన్సాస్ ట్రస్ట్, ఈ ప్రతిష్టాత్మక ఏవియేషన్ ఎడ్యుసిటీ కోసం భీమిలి మండలం అన్నవరం గ్రామంలో 136.63 ఎకరాలభూమిని కేటాయించింది.

కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ…

ఇది చారిత్రకత్మక దినం.. ఉత్తరాంధ్ర ఒకప్పుడు వెనుకబడ్డ ప్రాంతం.. వలసల ప్రాంతం.. ఇప్పుడు అభివృద్ధి చెందిన విశాఖగా మార్చారు. 18 నెలల్లో చంద్రబాబునాయుడు, లోకేష్ (Lokesh) పౌర విమానయానం అత్యంత ప్రాముఖ్యత కలిగిన విభాగం ఇది. అత్యంత ప్రాముఖ్యత కలగడానికి ప్రధాని మోడీ కారణం. ప్రతి సం.12శాతం గ్రోత్ రేట్ ఉంది. అంటే అప్పటి మంత్రి ఇప్పటి గవర్నర్ అయిన అశోక్ గజపతి రాజు పేజీ కనపడు తుంది. 800 ఎయిర్ క్రాఫ్ట్ లు ప్రస్తుతం ఉన్నాయి. 1700 ఎయిర్ క్రాఫ్ట్ ఆర్డర్ 100 రకాల ఉద్యోగాలు ఉంటాయి. ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ కి అగ్రికల్చర్, ఇన్ఫ్రా, ఏవియేషన్ తదితర అనేక అంశాలపై చంద్రబాబు నాయుడుకు పూర్తి అవగాహన ఉంటుంది. రాబోయే 30, 40 సం తరువాత ఏమి అవసరం అనే ఆలోచన చేస్తారు. నెల రోజుల్లో ట్రయల్స్ జరుగుతాయి. భోగాపురంలో జూలైలో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం వుంటుంది. యూనివర్సిటీని ఎడ్యుసిటీగా మార్చాం.. ప్రపంచంలో ఏ యూనివర్సిటీతో అయినా మనం దీనిలో తేవచ్చు. వలసలకు మనం వెళ్ళే రోజుల నుండి మన వద్దకు ప్రపంచం వచ్చే విధంగా తీర్చిదిద్దారు చంద్రబాబు నాయుడు అన్నారు.

నారా లోకేష్ మాట్లాడుతూ…

బీహార్ లో నితీష్ కుమార్ (Nitish Kumar) ప్రమాణ స్వీకారానికి వెళ్ళాం.. గడిచిన 18నెలల్లో ఏపీలో ఒక మ్యాజిక్ జరుగుతుందని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు. మెసైల్స్, జి పి ఎస్ రెండు కలిసి పని చేస్తున్నాయ‌ని, తలసరి ఆదాయం తక్కువ ఉందని, అహర్నిశలు కష్ట పడుతున్నామ‌ని ఐటీ కంపెనీలు భీమిలికి వస్తున్నాయన్నారు. జిఎంఆర్ 10వ తరగతి ఫెయిల్ అయ్యారు… ఆ తర్వాత మాన్సాస్ లో ఇంటర్ చదివి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ పోర్ట్ లు కడుతున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం టైమ్ లో కొంత మంది ఎగతాళి చేశారు.. ఎయిర్పోర్ట్ కి 5వేల ఎకరాలు అవసరమా అని.. ఇప్పుడు దాని విలువ అర్థమ‌వుతుంద‌న్నారు. కొన్నిచోట్ల ఇప్పుడు 2వ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ట్రై చేస్తున్నారని, సివిల్ ఏవియేషన్ లో ప్రపంచంలో 25శాతం మన తెలుగువారు ఉండాలనేది చంద్రబాబు నాయుడు ఆలోచన అన్నారు. ఒక గజం భూమి కోసం కొట్టుకుంటున్న సమాజంలో వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఇస్తున్నారని, దీనికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని, కనీసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, భూముల నిమిత్తం అంత గొప్ప కుటుంబం గజపతి కుటుంబమ‌న్నారు.

బీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ…

మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశంలో గోవా గవర్నర్ (Gova Governer) అశోక్ గజపతి రాజు, అయ్యన్న పాత్రుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ సిఈవో శివ ప్రసాద్ రాజు, ఐటీ మంత్రి లోకేష్ కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు నాయుడు ముందు ఉంటారన్నారు. హైదరబాద్ నగర అభివృద్ది చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదేన‌ని, దేశ యావత్తు రాజకీయాలు ఏపీ భవన్ లో ఉండేవన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నిర్మాణంలో ముఖ్య భూమిక చంద్రబాబు నాయుడుద‌ని, భోగాపురం ఎయిర్ పోర్ట్ ను అను సంధానం చేసుకుంటూ విశ్వ విద్యాలయం ఏర్పాటు చూస్తే చంద్రబాబు నాయుడు విజన్ అర్ధం అవుతుందన్నారు. ఈ 18 నెలల్లో మొత్తం ఇకో సిస్టమ్ తీసుకొచ్చారన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ముఖ్య భూమిక పోషిస్తున్న వ్యక్తి లోకేష్.. ఒకప్పుడు విమానం లగ్జరీ ఇప్పుడు అవసరమైంద‌న్నారు. 12నెలలు అంటే కుదరదు ఒకరోజు ముందే పూర్తి చేయాలనే అంత ఆలోచనతో లోకేష్ పని చేస్తున్నారన్నారు.

గోవా గవర్నర్, ​మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ…

ఉత్తరాంధ్ర విద్యార్ధులకు మంచి విద్య త‌మ ట్రస్ట్ నుండి ఇస్తున్నామ‌న్నారు. మన ప్రాంతానికి ఒక నైపుణ్యం కలిగిన ఎడ్యుకేషన్ (Education) ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు.. దీనిపై అతి ఎక్కువ శ్రద్ధ తీసుకున్న చంద్రబాబు నాయుడు, లోకేష్ లకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

స్పీక‌ర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ…

1983లో రాజకీయాల్లోకి వచ్చాను.. అప్పటి నుండి చూస్తున్న.. ఇప్పుడు ఉత్తరాంధ్రకీ మహర్దశ వచ్చిందన్నారు. ఉత్తరాంధ్రకీ ఎన్ టి రామా రావు ఒక గుర్తింపు తెచ్చారన్నారు. ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ మమ్మల్ని నిద్రపోనివ్వ‌డం లేద‌న్నారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఇంతలా పనిచేస్తున్న కూడా.. ఇంకా అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. పార్టీలు ఉంటాయి కానీ.. మంచి కార్యక్రమానికి ప్రోత్సాహం ఉండాలన్నారు. జీఎంఆర్ మల్లికార్జున (Gmr Mallikarjuna) ఢిల్లీలో ఒకమాట అన్నారు.. నా ప్రాంతంలో నాకు ఎయిర్పోర్ట్ కట్టే అదృష్టం కలిగిందని, ఏవియేషన్ యూనివర్సిటీకి భూములు ఇచ్చిన ఘనత అశోక్ గజపతి రాజుదన్నారు. ఇప్పటి రోజుల్లో రూ.10వేలు డొనేషన్ చేసి లక్ష రూపాయల ప్రచారం చేసుకుంటున్నారన్నారు. వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములు, ఆస్తులు ప్రజలకి ఇచ్చేసి సామాన్య జీవితం గడుపుతున్న వ్యక్తి అశోక్ గజపతిరాజు అన్నారు. పెద్ద పెద్ద ప్రాచీన్యత పొందిన వ్యక్తులు అనేక మంది ఈ మాన్సాస్ నుండి వచ్చినవారేన‌న్నారు.

Leave a Reply