రోడ్డు పై మొంథా ఎఫెక్ట్..
ఆంధ్రప్రభ ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : విజయవాడ (Vijayawada) అర్బన్ మండలం, ఐదవ పట్టణ ట్రాఫిక్ పరిధిలోని మొగల్రాజపురం సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ వద్ద మొంథా తుఫాను వలన రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్డుకి అడ్డంగా ఒక భారీ వృక్షం పడిపోయింది. ప్రజల రాకపోకలకు ఇబ్బందికరంగా ఉన్న ఆ భారీ వృక్షాన్ని ఐదవ పట్టణ ట్రాఫిక్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ యడ్లపల్లి. రవికుమార్ (Ravikumar) తన సిబ్బందితో వెంటనే స్పందించారు. రోడ్డుకు ఇరువైపులా జె.సి.బి సహాయంతో బుధవారం తొలగించారు. మార్గమధ్యలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి మూల మలుపుల వద్ద అధికంగా పెరిగిన మొక్కలను తొలగించినట్లు ఆయన తెలిపారు.
చలికాలంలో మంచు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్త వహించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలలో ప్రమాదాలు నివారించే కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని సర్కిల్ ఇన్ స్పెక్టర్ యడ్లపల్లి. రవి కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

