మోత్కూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు ..?

మోత్కూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు ..?
మోత్కూర్,ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన కోసం పార్లమెంటు లో బిల్లు ప్రవేశపెట్టేందుకు వేగంగా పావులు కదుపుతుండగా…మరో పక్క యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు కోసం స్థానిక రాజకీయ నేతలు, ఉద్దండులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మోత్కూర్, గుండాల, ఆత్మకూరు, అడ్డగుడూర్,మూట కొండూరు 5 మండలాలతో కలిసి మోత్కూర్ కేంద్రంగా అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో సోషల్ మీడియాలో మోత్కూర్ నియోజకవర్గ సాధన కమిటీ వాట్సాప్ గ్రూప్ సైతం ఏర్పాటు చేశారు.
గతంలో నియోజకవర్గ పునర్విభజన లో మోత్కూర్, అడ్డగుడూర్ మండలాలు తుంగతుర్తి నియోజకవర్గంలో, ఆత్మకూరు, గుండాల మండలాలు ఆలేరు నియోజకవర్గంలో విలీనం చేయడంతో ఈ ప్రాంత రాజకీయ అస్తిత్వం కాస్త దెబ్బ తింది.ఇప్పటికైనా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఈ 5 మండలలతో కలిసి నియోజకవర్గం ఏర్పాటు చేయాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.
