Mothkur l మున్సిపల్ పోరులో.. ఉద్యమకారుల కుటుంబ సభ్యులు..

Mothkur l మున్సిపల్ పోరులో.. ఉద్యమకారుల కుటుంబ సభ్యులు..
Mothkur, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ మలిదశ ఉద్యమకారుల కుటుంబ సభ్యులు 2, 7 వ వార్డులలో కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. 2 వ వార్డ్ లో ఓయూ జేఏసీ ఉద్యమ నాయకులు, మర్రి అనిల్ కుమార్, తల్లి మరియమ్మ (ఎస్సీ మహిళ) బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీలో ఉండి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
7వ వార్డులో తెలంగాణ ఉద్యమకారుడు, ఉస్మానియా క్యాంపస్ లో.. ఉదయించిన కిరణమా అనే పాటతో మలిదశ ఉద్యమ పోరాటానికి ఆజ్యం పోసిన సినీ గేయ రచయిత అభినయ శ్రీనివాస్ తన భార్య దొంతోజు శ్రీలత (బీసీ మహిళ)ను బీఆర్ఎస్ తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలోకి దింపారు. వీరు కూడా ఆ వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

