Mothkur | ఎంఈఓగా బాధ్యతల స్వీకరణ

Mothkur | మోత్కూర్, ఆంద్రప్రభ : మోత్కూరు మండల విద్యాధికారిగా టి. సత్యనారాయణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బుజిలాపురం ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ హెచ్ ఎంగా పనిచేస్తున్న సత్యనారాయణను యాదాద్రి జిల్లా ఆర్ జేడీ, డీఈఓ ఉత్తర్వుల మేరకు ఎంఈఓగా (ఎఫ్ ఏసి)గా నియామకం అయ్యారు. ఆయా పాఠశాలల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డా జి.లక్ష్మీనరసింహారెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ బొల్లేపల్లి వెంకటయ్య, మాజీ సర్పంచ్ చేతరాశి అంజయ్య , స్థానిక పాఠశాల, ఎంఆర్ సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ సత్యనారాయణను ఘనంగా సన్మానించారు.
