కలెక్టర్ని కలిసిన ఎంపీఓ జిల్లా సంఘం నాయకులు

కలెక్టర్ని కలిసిన ఎంపీఓ జిల్లా సంఘం నాయకులు
మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అనురాగ్ జయంతిని సోమవారం మండల పంచాయతీ అధికారుల(MPO) జిల్లా సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు పైళ్ల జనార్దన్ రెడ్డి, చంద్ర శేఖర్, దినకర్, సలీం, శ్రీలత, కేదారీశ్వర్, పోలేశ్వర రాజులు పాల్గొన్నారు.
