Mothkur | ఘనంగా ఆరాధ్య ఫౌండేషన్ ఛైర్మెన్ జన్మదిన వేడుకలు

Mothkur | మోత్కూరు, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో నిరుపేదలకు నిరంతరం ప్రజాసేవలు అందిస్తున్న ఆరాధ్య ఫౌండేషన్ ఛైర్మెన్ తాడోజు శ్రీకాంత్ రాజ్ జన్మదిన వేడుకలు గురువారం మున్సిపల్ కేంద్రంలోని శ్రీకాంతా చారి చౌరస్తా వద్ద ఆరాధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరాధ్య ఫౌండేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు గనగాని నర్శింహ్మ మాట్లాడుతూ.. ప్రతినిత్యం రాష్ట్రంలో పేదలు ఎక్కడ సమస్యలు ఎదుర్కొంటున్నా స్వయంగా తెలుసుకొని, తన శాయ శక్తులా ఆర్థిక సహాయాలు అందిస్తున్న ఆరాధ్య ఫౌండేషన్ చైర్మెన్ శ్రీకాంత్ రాజ్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆరాధ్య ఫౌండేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా గౌరవ అధ్యక్షులు దబ్బేటి సోంబాబు, రాష్ట్ర కమిటీ నాయకులు కల్వల నరేష్, నాయకులు గిరగాని వీరేందర్, స్థానికులు బుర్ర శ్రీనివాస్ గౌడ్, ఎడ్ల పక్కీర్ ,అంబటి విజయ్ కుమార్ గౌడ్, బుంగ యాదయ్య కొత్తకొండ భాస్కర్, పల్లె పంగ నర్సింహ్మ , నిలిగొండ మత్స్యగిరి, నోముల రమేష్, నేత వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
