ఓటర్ మహాశయులారా… ఆశీర్వదించి గెలిపించండి

ఓటర్ మహాశయులారా… ఆశీర్వదించి గెలిపించండి
8 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి విస్తృత ప్రచారం
మోత్కూర్ , ఫిబ్రవరి 7( ఆంధ్రప్రభ) : మోత్కూరు మున్సిపాలిటీలోని 8 వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి శనివారం ఆ వార్డులో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు . ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, పార్టీ జెండాలు , కండువాలు, టోపీ లు ధరించి ఇంటింటి ప్రచారం విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఈరోజు గీత కార్మికునికి తమ చేయి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఒక్కసారి తమకు అవకాశం ఇచ్చి కౌన్సిలర్ గా గెలిపిస్తే …వార్డులోని సమస్యలు అన్నింటిని పరిష్కరిస్తామని, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ సహకారంతో 8 వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ గుర్రం లక్ష్మీనరసింహారెడ్డి, నాయకులు అవిశెట్టి రాజాలు, అవిశెట్టి నాగరాజు, శేఖరా చారి, అన్నం దాసు మణికంఠ, ఎడ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు
