ఉదారత చాటుకున్న మోతిపటర్ కొత్త సర్పంచ్

లింగాపూర్, ఆంధ్రప్రభ : తాను సర్పంచ్ గా గెలిస్తే పెళ్లి జరుపుకునే పేదింటి ఆడపిల్లకు తన సొంత నిధుల నుంచి రూ. 21,000 వేలు అందిస్తానని హామీ ఇచ్చి నిలబెట్టుకున్నారు. చెక్కుతో పాటు పెళ్లికి వెళ్లి వదువరులను ఆశీర్వదించారు. కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలోని మోతి పటార్ గ్రామపంచాయతీ సర్పంచి రాథోడ్ సునీత నెహ్రూ ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా నన్ను మోతి పటార్ గ్రామపంచాయతీ సర్పంచిగా ఆదరించి గెలిపిస్తే బంగారు తల్లి పెరుట గ్రామపంచాయతీ పరిధిలోని ప్రతి ఆడపిల్ల పెళ్లిలకు తను పదవిలో ఉన్నంతకాలం తన సొంత నిధులు నుంచి రూ. 21,000 వేలు అందిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామ ప్రజలు ఆమెపై విశ్వాసం ఉంచి సర్పంచిగా గెలిపించారు.
దీనితో ఆమె ఇచ్చిన మాటను నిలుబెట్టుకోవాలని ఉద్దేశంతో శుక్రవారం ఫట్కాల్ మంగి గ్రామానికి చెందిన చవాన్ జబ్బర్ లాల్ కాంతబాయి దంపుతుల కూతురి పెళ్లి రోజున బంగారు తల్లి పేరుట వధూవరులకు రూ. 21,000 వేలు చెక్కును ఇచ్చి హామీ నిలబెట్టుకున్నారు. దీనితో గ్రామ ప్రజలు. పలువురు కృతజ్ఞతలు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో రామేశ్వర్ నాయక్. భాను దాస్ తదితరులు పాల్గొన్నారు
