హైదరాబాద్;ఈ సృష్టికి మూలం అమ్మ. అమ్మ అనేది ఓ కమ్మని పాట. ఈ లోకంలో ప్రతి ప్రాణికి వరం అమ్మ. అమ్మ లేకపోతే సృష్టి లేదు. అమ్మ అనే మాట ఇంత తియ్యగా ఉంటే ఇక అమ్మ ఎంత మధురమో.
ఈ మదర్స్ డే రోజు అమ్మకు వందనం చేస్తూ అమ్మ గురించి ఎంతో చెప్పాలని ఉన్నా ..కొంతయినా చెప్పుకునే అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలు!మదర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు?ప్రతి సంవత్సరం మే నెలలో రెండో ఆదివారం రోజు మదర్స్ డేను జరుపుకుంటాము.
మదర్స్ డే ఎందుకు జరుపుకుంటారు?
గ్రీస్ లో రియా అనే దేవతను మదర్ ఆప్ గాడ్స్ గా భావించి సంవత్సరానికోసారి నివాళి అర్పించేవారు. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్ లో తల్లులకు గౌరవంగా మదరింగ్ సండే పేరుతో ఉత్సావాన్ని జరుపుకునేవారు. 1872లో జూలియవర్డ్ హోవే అనే మహిళ అమెరికాలో తొసారి ప్రపంచ శాంతి కోసం మదర్స్ డే నిర్వహించాలని ప్రతిపాదించింది. అన్న మేరీ జర్విస్ అనే మహిళ మదర్స్ ఫ్రెండ్ షిప్ డే జరుపుకునేందుకు ఎంతో కృషి చేసింది. మేరీ జర్విస్ మే 9వ తేదీ రెండవ ఆదివారం నాడు మరణించింది. ఆమె మరణానంతరం ఆమె కుమార్తె తన తల్లి జ్నాపకార్థం మిస్ జెర్విస్ మాతృదినోత్సవం కోసం ప్రచారం చేసింది. 1911లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ ఏటా మే రెండవ ఆదివారం రోజు మాతృదినోత్సవం అధికారికంగా జరుపుకోవాలంటూ నిర్ణయించారు.
కాలక్రమేణా ఇది ప్రపంచమంతటా వ్యాపించింది.అమ్మకు ఒక్కరోజు సరిపోతుందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. మొక్కుబడిగా ఒక్కరోజు మాతృదినోత్సవం పేరుతో అమ్మకు గ్రీటింగ్ కార్డులు, కేకులు, పువ్వులు కానుకలు ఇస్తే సరిపోదు. మన జీవితంలో ప్రతిక్షణం అమ్మకు అంకితం చేసినా కూడా సరిపోదు.