Karimabad | మోస్ట్ వాంటెడ్ రౌడీషీటర్ అరెస్టు

రౌడీ షీటర్స్ పై ప్రత్యేక నిఘ సీఐ బొల్లం రమేష్ వెల్లడి


కరీమాబాద్, జులై 11 (ఆంధ్రప్రభ ) : నగరానికి చెందిన మోస్ట్ వాంటెడ్ రౌడీషీటర్ (Most Wanted Rowdysheeter) ఆడెపు అనిల్ ను అరెస్టు చేశామని మీల్స్ కాలనీ ఇన్ స్పెక్ట‌ర్ బొల్లం రమేష్ (Bollam Ramesh) తెలిపారు. సీఐ బొల్లం రమేష్ కథనం ప్రకారం… రౌడీ షీటర్ అనిల్ పలు కేసులలో నేరస్తుడిగా ఉండి, తప్పించుకుని తిరుగుతున్న రౌడీ షీటర్ ఆడెపు అనిల్ (Aadepu Anil) @ గుమ్మా కరీమాబాద్ నివాసిని అరెస్ట్ చేసి జైలుకి పంపించటం జరిగినది.

ఇతను హత్య, హత్యా ప్రయత్నం, దారి దోపిడీ (రాబరీ) వంటి తీవ్రమైన నేరాలతో పాటు, పలు దాడి కేసులు, బెదిరింపుల కేసుల్లో నిందితుడని సీఐ తెలిపారు. వరంగల్ (Warangal) తో పాటు హైదరాబాద్ (Hyderabad) లో కూడా అతను పలు నేరాలు చేశాడు. ఇతని మీద త్వరలోనే పీడీ చట్టం కూడా మోపడానికి ఏర్పాటు చేస్తున్నట్లు ఇన్ స్పెక్టర్ బొల్లం రమేష్ తెలిపారు. ఈసందర్భంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్స్ అందరూ సత్ప్రవర్తన తో ఉండాలని, వారి మీద అనుక్షణం నిఘా ఉంటుందని, ఏ చిన్న నేరం జరిగినా జైలుకి పంపి పీడీ చట్టం ప్రయోగిస్తామని ఇన్ స్పెక్టర్ బొల్లం రమేష్ తెలిపారు. అలాగే ప్రజలు తమ దృష్టికి వచ్చే అసాంఘీక కార్యకలాపాల గురించి వెంటనే పోలీసులకు తెలియజేయాలని, రౌడీ షీటర్స్ గురించి భయపడవలసిన అవసరం లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply