చంద్రగ్రహణం సందర్భంగా ఆలయ మూసివేత..

చంద్రగ్రహణం సందర్భంగా ఆలయ మూసివేత..

మోపిదేవి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయంగా విరజిల్లుతున్న మోపిదేవి గ్రామంలోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానము నందు చంద్రగ్రహణం సందర్భంగా ఆగమ శాస్త్ర నియమావళి ప్రకారం ఆలయ ద్వారాలు మంగళవారం ఉదయం తాత్కాలికంగా మూసివేశారు. గ్రహణం సమాప్తి అనంతరం శాస్త్రోక్తంగా శుద్ధి కార్యక్రమాలు బుధవారం నిర్వహించబడునని ఆలయ ఈఓ దాసరి శ్రీరామ వర ప్రసాదరావు తెలిపారు. దేవాలయ వేదపండితులు స్వామి వారి ఆలయం మూసి వేశారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం బుధవారం ఉదయం 9 గంటల నుండి స్వామివారి దర్శనం కల్పించబడునని తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి దేవస్థానానికి సహకరించగలరని ఈఓ కోరారు.

Leave a Reply