ఆంధ్రప్రభ డెస్క్ : రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని ఆంక్షలు..ఆ వెంటనే అదనపు సుంకాలలతో భారత్ దోస్తీకి అమెరికా మంగళం పాడింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తంగా మారాయి. ట్రంప్ విధించిన సుంకాలను ఇండియా తీవ్రంగా విమర్శించింది. అమెరికా నిర్ణయం అన్యాయమైనది, అసమంజసమైనదని పేర్కొంది. మరోవైపు, రైతుల విషయంలో రాజీ పడేది లేదని, అందుకు వ్యక్తిగతంగా తాను మూల్యం చెల్లించడానికైనా సిద్ధమన్న ప్రధాని మోదీ (Prime Minister Modi) పరోక్షంగా అమెరికా పన్నులకు లెక్క చేయబోమని స్పష్టం చేశారు. దీనికి రష్యా, చైనా(Russia, China)లు తమ మద్దతు తెలిపాయి. అయితే భారత్ టారీఫ్(India tariff) ల గురించి చర్చలకు రెడీగా ఉన్నా..ట్రంప్ (Trump) మాత్రం అవకాశం లేదని తేల్చి చెప్పేశారు. ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో మోదీ అమెరికా, చైనా పర్యటనలు ఆసక్తికరంగా మారాయి.
ముందు చైనా.. ఆ తర్వాత యూఎస్..
భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటించేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. వచ్చే నెలలో ఐక్యరాజ్యసమితి (United Nations) జనరల్ అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరుకానున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో అదనపు సుంకాలు, దాని వలన యూఎస్ , భారత్ ల మధ్య నెలకున్న వాణిజ్య ఉద్రిక్తత పరిష్కారానికి మోదీ..ట్రంప్ తో భేటీ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతే కాదు ఐరాస సమావేశాలకు హాజరయ్యే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (President of Ukraine Zelensky)తో కూడా భారత ప్రధాని సమావేశం అవుతారు. రీసెంట్ గా వీరిద్దరూ ఫోన్ లో సంభాషించుకున్నారు. అప్పుడే కలిసి డైరెక్ట్ గా మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ లో న్యూయార్క్ లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశం జరగనుంది. దీనికి దాదాపు ప్రపంచదేశాల నేతలందరూ హాజరు అవుతారు.
టారీఫ్ లపై దండయాత్ర..
అయితే దీని కన్నా ముందు భారత ప్రధాని మోదీ చైనాలో పర్యటించనున్నారు. మోదీ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు చైనాలో పర్యటించనున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలోని తియాంజిన్ నగరంలో ఈ సదస్సు జరగనుంది. గల్వాన్ ఘర్షణల తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి. గతంలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జెన్ పింగ్ రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో చివరిసారిగా కలుసుకున్నారు. ఇప్పుడు ఈ సమావేశంలో ఇరు దేశాల సరిహద్దు వివాదాలు, వాణిజ్యం, ఉగ్రవాద నిర్మూలన వంటి కీలక అంశాలపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. అయితే వీటన్నింటి కన్నా ముందు టారీఫ్ లపై ముఖ్యంగా ఇరు నేతలూ చర్చించనున్నారని చెబుతున్నారు. టారీప్ ల విషయంలో భారత్ కు చైనా సపోర్ట్ చేస్తోంది. భారత్ కన్నా ముందు ఈ అత్యధిక సుంకాలకు చైనా పెద్ద బాధిత దేశం. ఆ దేశంపై ఏకంగా 125 శాతం టారీఫ్ లతో విరుచుకుపడ్డారు ట్రంప్. వరుసగా రెండు సార్లు 90 రోజుల విరామం ప్రకటించినప్పటికీ ఎప్పటికైనా చైనా వీటికి బలవ్వాల్సిందే. అసలే అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్న చైనా వీటిని ఒప్పుకోవడానికి ఏంత మాత్రం సిద్ధంగా లేదు. దీనికి తోడు ఇప్పడు భారత్, రష్యా వంటి దేశాలు కూడా యాడ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీ వరుసగా చైనా, యూఎస్ పర్యటనలు టారీఫ్ ల విషయంలో పెద్ద ఎఫెక్ట్ నే చూపించనుందని అంటున్నారు విశ్లేషకులు. పక్కా ప్లాన్ ప్రకారమే మోదీ పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు చెక్ పెడతారని అంటున్నారు.