మూడు వందేభార‌త్ రైళ్లు ప్రారంభించిన మోదీ

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : దేశ ప్రధానమంత్రి మోడీ బెంగళూరులో పర్యటిస్తున్నారు. ఆదివారం కెఎస్‌ఆర్‌ రైల్వే స్టేషన్ (KSR Railway Station) నుండి మూడు వందే భారత్ రైళ్ల ((Vande Bharat Trains)ను జెండా ఊపి ప్రారంభించారు. వీటిలో బెంగళూరు-బెళగావి, మాతా వైష్ణోదేవి కాత్రా-అమృత్సర్‌, నాగ్‌పూర్‌-పుణే వందే భారత్‌ రైళ్లు ఉన్నాయి. తరువాత, ఎలక్ట్రానిక్‌ నగరాన్ని బొమ్మనహళ్లితో అనుసంధానించే ఎల్లో లైన్‌ మెట్రో సేవను ప్రధానమంత్రి ప్రారంభించారు. బెంగళూరు-బెళగావి వందేభారత్‌ రైలులో ప్రయాణించి విద్యార్థులతో ముచ్చటించారు.

బెంగళూరులో మెట్రో ఎల్లో లైన్ ప్రారంభం
ప్రధాని మోదీ (Prime Minister Modi) మరో ముఖ్యమైన ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. బెంగళూరులోని ఎల్లో లైన్ (Yellow Line) మెట్రో సేవను ప్రారంభించారు. ఈ లైన్ మొత్తం 19.15 కిలోమీటర్ల పొడవు, 16 స్టేషన్లతో ఉంటుంది. ఈ కొత్త లైన్ RV Road (రాగిగుడ్డ) నుంచి బొమ్మసంద్ర వరకు ప్రయాణాన్ని సౌకర్యవంతం చేస్తుంది. ఈ కొత్త మెట్రో లైన్ ప్రారంభంతో బెంగళూరులోని హొసూర్ రోడ్, సిల్క్ బోర్డు వంటి రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఈ మార్గం ప్రజల కోసం సమయాన్ని పొడిగించి, రద్దీని తగ్గించడంలో కీలక పాత్ర పోషించనుంది.

బెంగళూరు మెట్రో ఫేజ్-3 ప్రాజెక్టుకు శంకుస్థాప‌న‌
ఈ సందర్భంగా ప్రధాని మోదీ బెంగళూరు మెట్రో ఫేజ్-3 (Bangalore Metro Phase-3) ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. దీని విలువ రూ. 15,610 కోట్లపైగా ఉంది. ఈ ప్రాజెక్టు 44.65 కిలోమీటర్ల పొడవుతో, 31 ఎలివేటెడ్ స్టేషన్లతో సుసాధ్యం అవుతుంది. ఈ ప్రాజెక్ట్‌తో బెంగళూరులో ప్రజా రవాణా మరింత మెరుగుపడనుంది. ప్రధాని మోదీ ఆ తర్వాత RV రోడ్ (రాగిగుడ్డ) నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వరకు మెట్రోలో ప్రయాణించారు. అలాగే ప్రధాని మోదీ బెంగళూరులోని కొన్ని ఇతర నగర కనెక్టివిటీ ప్రాజెక్టులును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు నగర ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందించడంతో పాటు, ట్రాఫిక్ సమస్యలను కూడా తగ్గించడంలో సహాయపడతాయి.

Leave a Reply