వెలగపూడి – ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అయింది. టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా నామినేషన్లు వేసిన వారిలో కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడు ఏకగ్రీవం అయ్యారు.
అలాగే.. బీజేపీ నుంచి సోము వీర్రాజు, జనసేన నుంచి నాగబాబు కూడా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేయడంతో ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ఆర్.వనితా రాణి ప్రకటించారు. ఎన్నికైన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
కాగా.. మార్చి 10న నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. అంతకు ముందే జనసేన పార్టీ అభ్యర్థి నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు.
ఏకగ్రీవం అయిన ఎమ్మెల్సీలు
కొణిదెల నాగబాబు (జనసేన), బీద రవిచంద్ర యాదవ్ (టీడీపీ, )బీటీ నాయుడు (టీడీపీ. )కావలి గ్రీష్మ (టీడీపీ). సోము వీర్రాజు (బీజేపీ)