జగద్గురును దర్శించుకున్న ఎమ్మెల్యే..

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : జుక్కల్ మండలంలోని దోస్ పల్లి- బంగారుపల్లి వద్దగాల శ్రీ జగద్గురువు రామనందా చార్య నరేంద్రాచర్యాజి సంస్థాన్ తెలంగాణ ఉపపీఠంలో సమస్య మార్గదర్శనం-దర్శన భాగ్యం కార్యక్రమంలో భాగంగా జగద్గురు శ్రీ నరేంద్రాచార్యజి భక్తులకు దర్శనమివ్వటమే కాకుండా సమస్య మార్గదర్శనం కార్యక్రమం కూడా కొనసాగింది.గురువారం ఉదయం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతరావు కాంగ్రెస్ శ్రేణులతో కల్సి ఉపపీఠంలో జగద్గురు రామానందచర్య నరేంద్రచార్యజిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా జగద్గురు వారికి ఆశీర్వదించి,తీర్థప్రసాదాలను అందించారు.ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతరావు మాట్లాడుతూ జుక్కల్ ప్రాతంలో తెలంగాణ ఉపపీఠం ద్వారా ప్రతి మూడు నెలలకు ఒకసారి జగద్గురువుల వారు ఆధ్యాత్మిక,భక్తి కార్యక్రమాలు నిర్వహించటం,దర్శన భాగ్యం కల్పించటం,సంస్థ ద్వారా రక్తదాన శిభిరాల,అవయవ దానాలు, అంబులెన్స్ సేవ అందించడమే,కాకుండా స్వచ్ఛంద కార్యక్రమాల్లో శిష్యులు,భక్తులు నిస్వార్ధంగా పాల్గొనడం ఆధ్యాత్మికత పెంపొందించడం బృహత్తర కార్యక్రమన్నారు.సంస్థన్ ద్వారా నిర్వహిస్తున్న సేవ కార్యక్రమాలు వేలకట్టలేనివని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఉప పీఠంలో సిసి రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఉపపీఠం ప్రముఖులు ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతరావును శాలువా పుష్పగుచ్ఛం తో సత్కరించరు.కాంగ్రెస్ నాయకులు సైతం జగద్గురు దర్శించుకున్నారు.అనంతరం జుక్కల్ మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ గోవింద్ మఠ్ సంస్థాన్ చేరుకొని శ్రీరామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం మఠాధిపతి శ్రీ గోపాల్ గోవింద్ మహరాజ్ ను దర్శించుకున్నారు.ఈ సందర్భంగా శ్రీ గోపాల్ గోవింద్ మహారాజ్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు శాలువతో సత్కరించి ఆశీర్వదించారు.

Leave a Reply