MLA Venigandla Ramu | గుడివాడలో అభివృద్ధి ప‌రుగులు

MLA Venigandla Ramu | గుడివాడలో అభివృద్ధి ప‌రుగులు

  • ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చొర‌వ‌తో ప్రధాన రహదారుల సమస్య పరిష్కారం
  • నిన్న రూ.2.50 కోట్లతో బైపాస్ రోడ్డు….
  • నేడు రూ.99 లక్షలతో కార్ల స్టాండ్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

MLA Venigandla Ramu | గుడివాడ, ఆంధ్రప్రభ : గత 20 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని గుడివాడలో… శూన్యం నుంచి కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతుందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ముందుగా ప్రధాన సమస్యలు (problems) పరిష్కరిస్తున్నామని పేర్కొన్న ఎమ్మెల్యే.. ప్రజల సమస్యలన్నిటినీ పరిష్కరించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని అన్నారు.

MLA Venigandla Ramu

గుడివాడ పట్టణంలోని ప్రధాన రహదారుల్లో ఒకటైన గౌరీ శంకరపురంలోని కార్ల స్టాండ్ రోడ్డు అభివృద్ధి పనులను ఈ రోజు ఉదయం ఎమ్మెల్యే (MLA) ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఆర్డీఏ నిధులు రూ.99.09 లక్షలతో చేపట్టనున్న బీటి రోడ్డు, నూతన డ్రైనేజీ నిర్మాణ పనులకు కూటమినేతలతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కార్ల స్టాండ్ వద్ద నుంచి చిన్న శివాలయం వరకు పరిసరాలు పరిశీలించిన ఎమ్మెల్యే …. ఆక్రమణల కారణంగా డ్రైనేజీ పూడిక పోవడాన్ని గుర్తించారు. పూర్తి నాణ్యతతో రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న మేజర్ రోడ్ల పనులను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ప్రధాన రహదారులు పనులు పూర్తయిన తర్వాత అంతర్గత రహదారులను కూడా వేస్తామని ప్రజలు అపోహలకు పోవద్దన్నారు. గుడివాడ అభివృద్ధికి శ్రీకారం చుట్టి ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని, కానీ ఒక్కసారిగా మార్పు తీసుకురావడం సాధ్యం కాదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అందరి సహకారంతో గుడివాడలో ప్రజలందరి సమస్యలు పరిష్కరించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పునరుద్ఘాటించారు.

MLA Venigandla Ramu

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్, ఎం ఈ ప్రసాద్, జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్,మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, గుడివాడ (Gudivada) టిడిపి అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, టిడిపి నాయకులు చేకూరు జగన్మోహన్రావు, డాక్టర్ గోర్జి సత్యనారాయణ, లింగం ప్రసాద్, పండ్రాజు సాంబయ్య, రెడ్డి షణ్ముఖ, మజ్జాడ నాగరాజు, గోకవరపు సునీల్, సిరిపురపు తులసీరాణి, బాలసాని భవాని శంకర్, యక్కలి మణిదీప్, మాదాల సునీత, రఘు, ఇమ్మానుయేలు, రాజా, వెంకటేష్, అనిల్ బాబు, ఏసుపాదం, మున్సిపల్ డీఈలు, ఏఈలు పలువురు అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply