MLA | రేపు ఘంటసాలలో ప్రజాదర్బార్…

MLA | రేపు ఘంటసాలలో ప్రజాదర్బార్…
MLA | ఘంటసాల, ఆంధ్రప్రభ : అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల గ్రామంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే(MLA) మండలి బుద్దప్రసాద్ తెలియజేశారు.
మండలంలోని 22 గ్రామాల ప్రజల తమ సమస్యల నిమిత్తమై అర్జీలు అందించాలని, సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయా శాఖల అధికారుల పర్యవేక్షణలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన గురువారం తెలిపారు.
ప్రజల ఇబ్బందులు తొలగించేలా ప్రతీ మండలంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించటం జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మండల స్థాయి అధికారులు, పంచాయతీల కార్యదర్శులు తప్పకుండా ప్రజాదర్బార్ కార్యక్రమానికి హాజరు కావాలని ఎంపీడీవో సుబ్బారావు తెలిపారు.
