MLA | సొంత భవనం మంజూరు చేయాలని…

MLA | సొంత భవనం మంజూరు చేయాలని…
MLA | నిజాంపేట, ఆంధ్రప్రభ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రోహిత్ రావు(MLA Rohit Rao)కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బండారి ప్రశాంత్ మాట్లాడుతూ.. రామాయంపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పడి మూడు సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు కళాశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు విద్యను కొనసాగించలేకపోతున్నారని అన్నారు. దాదాపు 150 మంది విద్యార్థులు ఉంటే దానిలో 50 మంది మహిళ విద్యార్థులు ఉన్నారు.
ఆ 50 మంది విద్యార్థులు కూడా ఒకటే వాష్ రూమ్ వాడడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేక సెకండియర్, థర్డ్ ఇయర్ చదివి విద్యార్థులు బయట కూర్చునే పరిస్థితి రామయంపేట డిగ్రీ కళాశాలలో ఏర్పడిందని అన్నారు. విద్యార్థులు తాగడానికి వాటర్ లేక ఇబ్బందులు పడుతున్నారనీ, అటెండర్లు లేక అటెండర్లు చేయాల్సిన పని కూడా కళాశాలలో ఉన్నటువంటి లెక్చరర్స్, విద్యార్థులు చేసుకోవాల్సిన పరిస్థితి డిగ్రీ కళాశాలలో ఏర్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు అర్జున్ సతీష్ దినేష్, సన్నీ సాయి తదితరులు పాల్గొన్నారు.
