MLA | పిట్టల ఎల్లయ్యపల్లి సర్పంచ్ ఏకగ్రీవం..

MLA | పిట్టల ఎల్లయ్యపల్లి సర్పంచ్ ఏకగ్రీవం..

  • ఉపసర్పంచ్, వార్డు సభ్యులు కూడా..

MLA | ఓదెల, ఆంధ్రప్రభ : ఓదెల మండలం పిట్టల ఎల్లయ్యపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. స్థానిక ఎన్నికల సందర్భంగా సర్పంచ్ సహా 8 వార్డు సభ్యుల స్థానాలకు ఏకగ్రీవ తీర్మానాల(Unanimous resolutions)తో ఎన్నుకోవడం చర్చనీయాంశంగా మారింది.

గ్రామ సర్పంచ్ గా పిట్టల రవికుమార్ ఎన్నిక కాగా, 5వ వార్డ్ నుండి ఏకగ్రీవంగా ఎన్నికైన పెండం శ్రీకాంతు ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే 1వ వార్డు తూడి అహల్య, 2వ వార్డు బండి రాజ్కుమార్, 3వ వార్డు కనుకుంట్ల శ్రీనివాస్, 4వ వార్డు పిట్టల నవీన్, రవ వార్డు రాయల సుస్మిత, 7వ వార్డు పిట్టల శారద, 8వ వార్డు కందుల వనితలు సైతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ పిట్టల రవికుమార్ మాట్లాడుతూ… తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధి(development) కోసం ఉపసర్పంచ్, వార్డు సభ్యులు పాలకవర్గ సహకారంతో ముందుకు సాగుతానని స్పష్టం చేశారు.

గ్రామాన్ని ఓదెల మండలంలోని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే(MLA) చింతకుంట విజయ రమణారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఉప సర్పంచ్ గా ఎన్నికైన పెండెం శ్రీకాంత్ మాట్లాడుతూ… గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్ది జిల్లాలోనే ఒక నెంబర్ వన్ గ్రామంగా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.

Leave a Reply