పట్టణాభివృద్ధికి పార్టీలకు అతీతంగా ముందుంటా…

పట్టణాభివృద్ధికి పార్టీలకు అతీతంగా ముందుంటా…
- ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి
జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి ; జనగామ పట్టణాభివృద్ధికి పార్టీలకు అతీతంగా తోడ్పాటు అందిస్తానని స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు శుక్రవారం జనగామ మున్సిపల్ కౌన్సిల్ బాధ్యతలు మున్సిపల్ చైర్ పర్సన్ గా కడకంచి బాలమణి శ్రీనివాస్ చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. జనగామ మున్సిపాలిటీ రాష్ట్రంలో పురాతనమైన మున్సిపాలిటీ పట్టణ అభివృద్ధిలో జరగవలసిన అభివృద్ధి జరగలేదని అన్నారు. ఈ నూతన కౌన్సిల్ పట్టణ అభివృద్ధికి పార్టీలకతీతంగా అభివృద్ధిలో తోడ్పాటు అందించాలని అందుకోసం అత్యధిక నిధులు తీసుకువచ్చేందుకు అవసరమైతే ప్రభుత్వం మంత్రులతో మాట్లాడి పట్టణ అభివృద్ధికి పాటుపడాలని అన్నారు.
కౌన్సిల్లో కౌన్సిలర్లు ప్రతి వార్డు అభివృద్ధి కోసం తోడ్పాటు ఇస్తామని తెలిపారు. ఈ తొలి సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ మాట్లాడుతూ.. జనగామ పట్టణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ జనగామ ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ సహకారం కేంద్ర నిధులతో అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. ఈ చైర్మన్ పదవి అనేది బాధ్యతగా ప్రజలు ఇచ్చిన వరంగా ప్రజలకు సేవ చేయడమే నా ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. పార్టీలకతీతంగా ప్రతి కౌన్సిలర్ జనగామ పట్టణ అభివృద్ధికి తారతమ్య భేదాలు లేకుండా పట్టణ అభివృద్ధికి పాటుపడేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పర్వతాలు..
1 వ వార్డు:- సజ్జ దుర్గాప్రసాద్
2 వ వార్డు:- రామగల విజయ్
3 వ వార్డు:- బూడిద జ్యోతి (
4 వ వార్డు:- మంత్రి సుమలత
5 వ వార్డు:- మిద్దెపాక భాస్కర్
6 వ వార్డు:- బుక్క భరద్వాజ్
7 వ వార్డు:- సాజిద్ కమర్
8 వ వార్డు:- సందుపట్ల మంజుల
9 వ వార్డు:- గుడిగంటి వెన్నెల
10 వ వార్డు:- నేరేటి రజిని
11వ వార్డు:- ఎనగందుల అనూష
12వ వార్డు:- వంగ ఉమా
13 వ వార్డు:- పానుగంటి సువార్త
15 వ వార్డు:- మారబోయిన పాండు
16:- కడమంచి సుశీల రమేష్
18 వ వార్డు:- గోపగాని సుగుణాకర్
19 వ వార్డు:- దోర్నాల అనిత
20 వ వార్డు:- దామెర రాజు
21 వ వార్డు:- మామిడాల రజిత
24 వ వార్డు:- గంగరబోయిన
25 వ వార్డు:- పాముకుంట్ల ప్రసాద్
26 వ వార్డు:- చేవెళ్లి మధు
28 వ వార్డు:- మహమ్మద్ సమ్మద్
30 వ వార్డు:- నరసింహారెడ్డి లోకమంతా రెడ్డి
