MLA Danam Nagender | స్పీకర్ విచారణ ప్రారంభం

MLA Danam Nagender | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై దాఖలైన రెండు అనర్హత పిటిషన్‌పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్‌లో అధికారికంగా విచారణ ప్రారంభించారు. బీఆర్ఎస్ తరఫున పిటిషన్ వేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఆయన తరఫు న్యాయవాదులు స్పీకర్ ఎదుట హాజరై తమ వాదనలు విపించనున్నారు. మరోవైపు దానం నాగేందర్ తన న్యాయవాదులతో విచారణకు హాజరయ్యారు.

అయితే, దానం నాగేందర్ విచారణకు ముందే స్పీకర్‌కు ఓ అఫిడవిట్ సమర్పించారు. అందులో తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, ఇప్పటికీ ఆ పార్టీలోనే కొనసాగుతున్నానని పేర్కొన్నారు. 2024 మార్చిలో తాను కాంగ్రెస్ సమావేశానికి హాజరైంది కేవలం వ్యక్తిగత హోదాలోనే తప్ప పార్టీ మారినట్లుగా కాదని తెలిపారు. అలాగే ఇదే కేసులో బీజేపీ శాసనసభా పక్ష నేతల ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై స్పీకర్ ప్రసాద్ కుమార్ మధ్యాహ్నం 12 గంటలకు విచారణను ప్రారంభించనున్నారు.

Leave a Reply