MLA | బీఆర్ఎస్ హ‌యాంలోనే చిట్యాల మున్సిపాల్టీ అభివృద్ధి

MLA | బీఆర్ఎస్ హ‌యాంలోనే చిట్యాల మున్సిపాల్టీ అభివృద్ధి

MLA | చిట్యాల, ఆంధ్ర‌ప్ర‌భ : బీఆర్ఎస్ హ‌యాంలోనే చిట్యాల మున్సిపాల్టీ అభివృద్ధి(Municipality development) జ‌రిగిందని, కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేత‌గానిత‌నం వ‌ల్ల అభివృద్ధి కుంటుప‌డింద‌ని నకరికల్లు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. ఈ రోజు చిట్యాల మున్సిపాలిటీలో గ‌త‌ ప్రభుత్వం మంజూరు చేసిన రూ. రెండు కోట్లతో మంజూరు చేసిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరిశీలించారు.

ప్రస్తుత ఎమ్మెల్యే ఇప్పటివరకు ఒక్కరోజైనా పట్టణ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించలేదంటే ఆయనకు ఈ ప్రాంతంపై ఎలాంటి ఆలోచన ఉందో ప్ర‌జ‌లు తెలుసుకోవాల‌ని లింగ‌య్య అన్నారు. గత రెండేళ్లలో పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే(MLA) ఏం చేశారో ప్రజలకు తెలియజేస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే అనుచరులు విచ్చలవిడిగా అక్రమ దందాలకు పాల్పడుతూ, సంక్షేమ పథకాల అమల్లో కొర్రీలు పెడుతూ పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

MLA |

Leave a Reply