ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్, అక్టోబర్ 24 (ఆంధ్రప్రభ ) : ప్రజా ప్రభుత్వం పేదల సొంతింటి కల సాకారం చేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. ఆయన శుక్రవారం ఉట్నూర్ మండలంలోని మారుతిగూడ, ఎక్స్ రోడ్ హనుమాన్ నగర్ లో ఇందిరమ్మ ఇళ్లకు నిర్మాణానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించకుండా చూడాలని లబ్ధిదారులు స్వయంగా పనులను పరిశీలించాలని ఎమ్మెల్యే కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అనేక అబివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇండ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలని అన్నారు. కార్యక్రమంలో అధికారులు , నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.

