ADB | భూపాలపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన ఎమ్మెల్యే బోజ్జు పటేల్
ఉట్నూర్, ఫిబ్రవరి 21 (ఆంధ్రప్రభ) : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే నివాసంలో ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ను భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈసందర్బంగా ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్, ఆయన సతీమణి దృపత దంపతులు భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ రావును శాలువాతో సత్కరించి, ఘనస్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఇరువురు ఎమ్మెల్యేలు పలు విషయాలపై చర్చించుకున్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.