MLA | ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు ఘన సన్మానం

MLA | ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు ఘన సన్మానం
MLA | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణ అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేయించి, పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు శనివారం పట్టణంలోని 31వ వార్డులో ఘన సన్మానం జరిగింది. యూఐడీఎఫ్, డీఎం ఎఫ్ టీ నిధుల ద్వారా మంజూరైన అభివృద్ధి పనుల శంకుస్థాపన సందర్భంగా 31వ వార్డు కాంగ్రెస్ మహిళ లీడర్ లెంకల శ్వేత – లెంకల శ్రీనివాస్ (కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి పట్టణ ఉపాధ్యక్షుడు) దంపతులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
హనుమాన్ బస్తీ – బాబు క్యాంపు ప్రాంతాల్లో రూ. 45 లక్షలతో చేపట్టనున్న రోడ్డు, డ్రైనేజీ పనుల పట్ల వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య, టీపీసీసీ సభ్యుడు చిలుముల శంకర్, సీనియర్ నాయకులు నాథరి స్వామి, మత్తమారి సూరి బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి బుకాల రంజిత్ కుమార్, యువ నాయకులు లెంకల శ్రవణ్ కుమార్ (సన్నీ యాదవ్), ఎల్దండి శ్యామ్, మంద కుమార్, మల్లికార్జున్, వార్డు మహిళలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
