MLA | బీఆర్‌ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిని గెలిపించాలని..

MLA | బీఆర్‌ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిని గెలిపించాలని..

  • ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

MLA | జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి : జనగామ మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ ప్రచారం ఉధృతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం జనగామ మునిసిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో బీఆర్‌ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి బల్దే అంజలి–ఆంజనేయులు దంపతులను గెలిపించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను వివరించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతు తెలుపుతూ భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply