MLA | ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే

MLA | ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే

MLA | మోపిదేవి – ఆంధ్రప్రభ : ఈ నెల 29న పెద్దకళ్లేపల్లిలో జరిగే వేటూరి సాహితీ మహోత్సవం విజయవంతం చేయాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం మోపిదేవి మండలం పెద్దకళ్లేపల్లిలోని శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి దేవస్థానం వద్ధ వేటూరి సాహిత్య ఉత్సవ ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అమెరికా వేటూరి సాహిత్య అభిమాన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ గురువారం సాయంత్రం 4గంటలకు సుప్రసిద్ధ సినీ గీత రచయిత స్వర్గీయ వేటూరి సుందర రామమూర్తి 90వ జయంతి సందర్భంగా ఈ వేడుకలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వేటూరి ప్రత్యేక పాటల సంగీత విభావరి, ఆరు సంపుటాల వేటూరి సినీయేతర సాహిత్య అంకితోత్సవం జరుగుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమానికి అమెరికా వేటూరి సాహిత్య అభిమాన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, సుప్రసిద్ధ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్, ప్రముఖ సినీ గీత రచయిత తిపిర్నేని కళ్యాణ్ చక్రవర్తి, తెనాలి డబుల్ హార్స్ ఎండీ మునగాల మెహన్ శ్యామ్ ప్రసాద్, అమెరికా నుంచి ప్రముఖ సాహితీవేత్త జీడిగుంట విజయసారధి, విశిష్ట రచయిత ఎర్రాప్రగడ రామకృష్ణ, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ నుంచి గోళ్ళ నారాయణరావు విచ్చేయనున్నట్లు వివరించారు.

పెద్దకళ్లేపల్లి గ్రామ ముద్దుబిడ్డ వేటూరి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ వేడుకలను గ్రామ ప్రజలు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. సమావేశంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, గ్రామ సర్పంచ్ అరజా సంధ్యారాణి, వైస్ ఎంపీపీ కడవకొల్లు సీతా రామాంజనేయులు, ఎంపీటీసీ అరజా ఆశాదేవి, పీఏసీఎస్ చైర్మన్లు పూషడపు రత్నగోపాల్, అరజా రాధిక, గ్రామ ప్రముఖులు అరజా కిరణ్ కాంత్, ఏఎంసీ డైరెక్టర్ మెరకనపల్లి నరేష్, టీడీపీ, జనసేన గ్రామ అధ్యక్షులు అరజా వేణుగోపాల్, కేతరాజు శ్రీనివాసరావు, నీటి సంఘ అధ్యక్షుడు గొర్రెపాటి దుర్గా నాగేశ్వరరావు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గొర్రెపాటి రమేష్ చంద్రబాబు, నాయకులు తోట కృష్ణాంజనేయులు, గోళ్ళ శ్రీనివాసరావు, బాదర్ల లోలాక్షుడు, మాజీ ఎంపీటీసీ అర్జా సాంబశివరావు, చోడగం రాధాకృష్ణ, కోసూరు చింతామణి, గంధం కృష్ణయ్య, కాలారి రామారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply