MLA | అంబేద్కర్ రాజ్యాంగమే దేశానికి రక్షణ

MLA | అంబేద్కర్ రాజ్యాంగమే దేశానికి రక్షణ
- బెల్లంపల్లిలో గణతంత్ర దినోత్సవం వేడుకల్లో
- మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి
MLA | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : దేశం నేడు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉందంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనేనని మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదదేవి అన్నారు. ఈ రోజు బెల్లంపల్లి పట్టణంలోని పాత బస్టాండ్ తో పాటు రైల్వే స్టేషన్ సమీఫంలో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవం వేడుకల్లో శ్రీదేవి పాల్గొన్నారు. ఈ వేడుకలు ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు దార కళ్యాణి ఆధ్వర్యంలో జరిగాయి.
ఈ సందర్భంగా పాత బస్టాండ్ లో పట్టణ అధ్యక్షురాలు కల్యాణి, రైల్వే స్టేషన్ సమీపంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవిలు జెండా ఎగురవేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా, రాజ్యాంగ విలువలను తూచా తప్పకుండా పాటించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని పేర్కొన్నారు.
అటల్ బీహారీ వాజ్పేయి ప్రధాని అయిన తర్వాతే పార్లమెంటులో అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి సముచిత గౌరవం కల్పించారని గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం కూడా అదే స్ఫూర్తితో బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అమురాజుల రాజేశ్వర్, జిల్లా ఉపాధ్యక్షుడు కోడి రమేష్, జిల్లా కార్యదర్శి రాచర్ల సంతోష్, సీనియర్ నాయకులు ఒడ్నాల స్వామి, వేల్పుల రాజయ్య, జిదుల రాములు, ఆకుల శంకర్, పట్టణ ప్రధాన కార్యదర్శి కునిరాజుల అరవింద్, జిల్లా కార్యవర్గ సభ్యులు ముడిమడుగుల శ్రీనివాస్, ఎరుకల నర్సింగ్, పట్టణ ఉపాధ్యక్షుడు సల్లం సుమలత, బాసబోయిన యుగేందర్, కోశాధికారి సంతోష్ అగర్వాల్, గౌస్ షేక్ బాబా, ఎర్రోజు శ్రీనివాస్, స్రవంతి, కోదాటి కళావతి, గర్రెపల్లి రాకేష్, పోతురాజుల శంకర్, తోటపల్లి ఓం సాయి, కొట్రంగి నారాయణ, పుల్ల ప్రశాంత్, సదన్న, మురళి కృష్ణ, ఆడెపు గణేష్, సల్లం క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
