MLA | రాజ్యాంగ విలువలను కాపాడుకుందాం…

MLA | రాజ్యాంగ విలువలను కాపాడుకుందాం…
- ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు
MLA | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన మహోన్నత గ్రంథమని, రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పిలుపునిచ్చారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఉదయం బెల్లంపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొని ఎమ్మెల్యే జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే నేడు బడుగు, బలహీన వర్గాలకు అధికారం, హక్కులు దక్కుతున్నాయని కొనియాడారు. పార్టీ శ్రేణులంతా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రజల సేవలో పునరంకితం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి టౌన్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, లీడర్లు చిలుముల శంకర్, దావ రమేష్, నాతరి స్వామి, బండి రాములతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, లీడర్లు పాల్గొన్నారు.
