MLA | శ్యామ‌ల హాస్పిటల్‌ ప్రారంభం..

MLA | శ్యామ‌ల హాస్పిటల్‌ ప్రారంభం..

  • రూ.5 కే వైద్యం అభినందనీయం
  • పేదలకు మెరుగైన వైద్యం అందించాలి

MLA | మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో కేవలం రూ.5 ఫీజ్‌తో వైద్యం అందించనున్న శ్యామల హాస్పిటల్‌ను ఈ రోజు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామెల్ మాట్లాడుతూ… మాజీ సర్పంచ్ డా కొత్తపల్లి వెంకటేశ్వర్లు (తేజ)మోత్కూర్ ప్రాంత ప్రజలకు కేవలం రూ.5 ఫీజుతో వైద్యం అందించడం అభినందనీయమన్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.

MLA

ప్రజలు ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఫైళ్ల సోమిరెడ్డి, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డా. గుర్రం లక్ష్మి నర్సింహారెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండగొని రామచంద్రు, మాజీ సింగిల్ విండో చైర్మన్ పి వెంకటేశ్వర్లు, నాయకులు పి. స్వామిరాయుడు, మెంట నగేష్, మెరుగు యాదగిరి, కోమటి మచ్చగిరి, సోమ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply