దేవాలయాల పరిరక్షణ, అభివృద్ధి మనందరి బాధ్యత..

దేవాలయాల పరిరక్షణ, అభివృద్ధి మనందరి బాధ్యత..
గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
ప్రసిద్ధిగాంచిన శ్రీ గౌతమేశ్వర, శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయాల, ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకారం
గుడ్లవల్లేరు – ఆంధ్రప్రభ : దేవాలయాల్లో ఆధ్యాత్మిక వైభవాలను పెంపొందించేలా ప్రతి ఒక్కరు భక్తి భావంతో కృషి చేయాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ఆలయాల పరిరక్షణ మనందరి బాధ్యత కావాలన్నారు. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ గౌతమేశ్వర స్వామి వారి దేవస్థానం, శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయాల ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకారం సోమవారం జరిగాయి.
ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే రాముకు ఆలయాల సంప్రదాయం ప్రకారం, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివార్లను దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ధర్మకర్తల కమిటీ సభ్యులను ఆయన అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాలకు ధర్మకర్తల కమిటీ సభ్యులుగా నియమితులైన వారు, దేవాలయాలను పరిరక్షించడం, అభివృద్ధి చేయడం అందరి బాధ్యతగా భావించాలనీ సూచించారు. ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక వైభవాలను పెంపొందించేలా భక్తుల సహకారంతో కమిటీలు పనిచేయాలన్నారు.
దేవాలయాలు మన సంస్కృతికి, సంప్రదాయాలకు నిలువు నిచ్చెనలన్నారు. వాటి పవిత్రతకు భంగం కరగకూడదన్నారు. . ఈ దిశగా మన దేవాలయ కమిటీలు కృషి చేయాలని కోరుతున్నాను.

ముందుగా శ్రీ గౌతమేశ్వర స్వామి వారి దేవస్థాన కమిటీ చైర్మన్ గా తూము బసవశంకరరావు, ధర్మకర్తల కమిటీ సభ్యులుగా బి వెంకటరమణ,సిహెచ్ నలిని, ఎన్ విజయలక్ష్మి, వి భారతి, ముద్దాల వెంకటేశ్వరరావు బాధ్యతలు చేపట్టగా… శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయ కమిటీ చైర్మన్ గా కొల్లి మృదుల, ధర్మకర్తల కమిటీ సభ్యులుగా కొండిశెట్టి శాంతి కుమారి, తుమ్మలపల్లి సామ్రాజ్యం, మాగంటి విజయ లక్ష్మి, నరేపాలెం శివకుమారి,దొడ్డ నాగరాణి,ఈడే జయలక్ష్మి విన్నకోట కనకదుర్గ,ఈడే వీర రాఘవమ్మ లు బాధ్యతలు స్వీకరించారు.
నూతన ధర్మకర్తల కమిటీ సభ్యులను ఎమ్మెల్యే రాము, కూటమి నాయకులు భక్తులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్చార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ సాయన పుష్పవతి, మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరి రవి, దేవాదాయ శాఖ తనిఖీ అధికారి ప్రసాద్, ఈవో శేఖర్, శ్రీ కొండలమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్ ఈడే మోహన్, టిడిపి నాయకులు గద్దె బాబురావు, పోలవరపు వెంకటరావు, కొడాలి రామరాజు, పీఏసీ చైర్మన్లు బాబి, డీసీ పాలేటి అంజనీయులు, యుగంధర్ జనసేన అధ్యక్షులు తోట చిన్నారి, నాయకులు పేర్ని జగన్, కౌతవరం గ్రామ నాయకులు మళ్లీ పెద్ద సుబ్రహ్మణ్యం, జోజీ, తూము శంకర్,కొల్లి నాన్జి, చిట్టిబొమ్మ, నరసింహారావు కంచర్ల ప్రకాష్, ఈడే కృష్ణ , పలు గ్రామాలకు కూటమి నాయకులు, నీటి సంఘాల అధ్యక్షులు, దేవాలయాల భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
