మోపిదేవిలో చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే…

మోపిదేవిలో చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే…

మోపిదేవి – ఆంధ్రప్రభ : మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానమునకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ ప్రారంభించారు.

దేవస్థానం వారు నూతనంగా ఏర్పాటు చేసిన షాపింగ్ కాంప్లెక్స్ సమీపంలో, ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వాహణ అధికారి శ్రీ దాసరి శ్రీరామ వరప్రసాదరావు గారు, ఆలయ సూపర్డెంట్ అచ్యుత మధుసూదన్ రావు గారు, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply