మంచినీటి మురుగునీటి సమస్యలపై వినతి పత్రం అందజేత…..

మంచినీటి మురుగునీటి సమస్యలపై వినతి పత్రం అందజేత…..
మేడ్చల్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల మండలి మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ అశోక్ రెడ్డి నీ గురువారం రోజు కలిసి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇచ్చిన వినతి పత్రం కే అశోక్ రెడ్డి ఐఏఎస్ కి ఇవ్వడం జరిగింది. మేడ్చల్ లో ఉన్నటువంటి పేద ప్రజలకు మంచినీటి సరఫరా వెంటనే సరఫరా చేయాలని, మురుగునీటి కాలువలు శుభ్రం చేయాలని కోరడం జరిగింది.
ఆయన స్పందిస్తూ రెండు మూడు రోజుల్లో మేడ్చల్ ప్రజలకు మంచినీటిని విడుదల చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మేడ్చల్ మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యులు ఆకిటి నవీన్ రెడ్డి, మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చీర్ల దయానంద యాదవ్, మేడ్చల్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి తదితరులు కలవడం జరిగింది.
