స్వామి గౌడ్ దశదినకర్మలో పాల్గొన్న ఎమ్మెల్యే

స్వామి గౌడ్ దశదినకర్మలో పాల్గొన్న ఎమ్మెల్యే
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు మొగుదాల రమేష్ గౌడ్ తండ్రి, చౌటుప్పల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మామ మొగుదాల స్వామి గౌడ్ దశదినకర్మ వలిగొండ రోడ్ లోని ఎస్ ఏం రెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి గౌడ్ చిత్రపటానికి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు, అధిక సంఖ్యలో పాల్గొని స్వామి గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
