MLA | ఆహ్వాన పత్రికల ఆవిష్కర‌ణ‌

MLA | ఆహ్వాన పత్రికల ఆవిష్కర‌ణ‌

MLA | గుడివాడ, ఆంధ్రప్రభ : భగవంతుడి కరుణాకటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా జీవించాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాంక్షించారు. గుడివాడ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన జగన్నాథ‌పురంలోని వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, కాకర్ల వీధిలోని వేణుగోపాల స్వామి వారి దేవాలయాల్లో జరుగునున్న వార్షిక ధనుర్మాస మహోత్సవాల ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే రాజేంద్రనగర్‌లోని తన స్వగృహంలో శనివారం ఉదయం, ఆలయాల కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి వేద పండితులు ఆశీర్వచనాలు అందచేయగా, దేవాదాయ శాఖ అధికారులు ఉత్సవాల వివరాలను తెలియజేశారు.

ఈనెల 30వ తేదీన జరిగే ముక్కోటి ఏకాదశి వేడుకల్లో పాల్గొనే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈనెల 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు జరిగే వార్షిక ధనుర్మాస మహోత్సవాల ఆహ్వాన పత్రికలను నేడు ఆవిష్కరించుకోవడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. వైష్ణవ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ధనుర్మాస ఉత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలన్నారు. స్వామివారి కరుణాకటాక్షాలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, దేవదాయ శాఖ కందుల గోపాలరావు, దేవస్థాన ధర్మకర్తల కమిటీ చైర్మన్ లింగం శివరాం ప్రసాద్, ఆల‌య కమిటీ చైర్మన్ అంగడాల సతీష్, వేద పండితులు వేదాంతం అప్పలాచారి, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply