చంద్రమ్మకు నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

చంద్రమ్మకు నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
మర్రిగూడ ,ఆంధ్రప్రభ: రాంరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తానేదారుపల్లి గ్రామనికి చెందిన సిపిఐ నాయకులు కర్నాటి అంజయ్య తల్లి కర్నాటి చంద్రమ్మ గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు. ఇట్టి విషయాన్ని స్థానిక నాయకుల ద్వార తెలుసుకున్న సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఆదివారం వారి నివాసానికి చేరుకొని ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు ఈదుల బిక్షం రెడ్డి, మండల కన్వీనర్ బుర్ర శేఖర్, మండల కార్యవర్గ సభ్యులు ఎరుకల నిరంజన్ గౌడ్, శాఖ కార్యదర్శి అబ్బనగోని కృష్ణయ్య, అడుమయ్య, జాల చంద్రయ్య, పాముల రమేష్, కొమురయ్య, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
