MLA | వైభవంగా కల్యాణ మహోత్సవం..

MLA | వైభవంగా కల్యాణ మహోత్సవం..
- స్వామివారి కల్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొలికపూడి..
MLA | తిరువూరు, ఆంధ్రప్రభ : తిరువూరు నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో మహా శివరాత్రి సందర్భంగా నిర్వహించిన గౌరీ శంకర మహేశ్వర పార్వతి కల్యాణ మహోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కల్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కొత్తపల్లి గ్రామానికి విచ్చేయగా గ్రామ నాయకులు, దేవస్థానం కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఉమా గౌరీ శంకర దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శివపార్వతుల దివ్య కల్యాణాన్ని దర్శించుకోవడం భక్తులకు ఆధ్యాత్మికానందాన్ని కలిగించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ చైర్మన్ మందడపు ఆదినారాయణ, గ్రామ పార్టీ అధ్యక్షులు గువ్వల ప్రతాప్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జి గువ్వల వెంకటేశ్వర రెడ్డి, మండల ఎస్సీ సెల్ కార్యదర్శి మల్లవరపు గవాస్కర్‌తో పాటు పలువురు నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల సందడితో కొత్తపల్లి గ్రామం శివనామ స్మరణతో మార్మోగగా, కల్యాణ మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా కొనసాగింది.

