MLA L ప్రజల్లో ఉండే వాళ్ళకే టికెట్స్ ఇచ్చినం…

MLA L ప్రజల్లో ఉండే వాళ్ళకే టికెట్స్ ఇచ్చినం…
మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకున్ని ఎన్నుకోండి
అధికార పార్టీ అభ్యర్థులు గెలిస్తే మీ వార్డులు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది
ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
ఖానాపూర్, ఆంధ్రప్రభ మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్న నాయకులకే కాంగ్రెస్ పార్టీ నుండి కౌన్సిలర్ టికెట్ ఇచ్చామని, వారిని గెలిపిస్తే మీ సమస్యలు పరిష్కారం అవుతాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిఅన్నారు. ఖానాపూర్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే ఒక్కో వార్డుకు రూ. 1 కోటి కేటాయించి సీ సీ రోడ్లు, డ్రైనేజీ లు, అలాగే తాగు నీటి సమస్యలు పరిష్కారంకు కృషి చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే బొజ్జు పటేల్. అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందన్నారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే ముఖ్యమంత్రి రేవంత్ నేతృత్వంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందన్నారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని, కానీ ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి కుటుంబంకు రేషన్ కార్డు అందజేశామన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి రేషన్ కార్డుదారుకు సన్న బియ్యం అందజేస్తున్నామన్నారు. ప్రజలందరూ ప్రజా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి హస్తం గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కో
