Miyapur | 10మందికి గాయాలు..

Miyapur | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మినీ బస్సు బోల్తాపడిన ఘటనలోో పది మంది ఉద్యోగులకు గాయాలైన ఘటన హైదరాబాద్ మియాపూర్‌లో చోటుచేసుకుంది.
లీ ఫార్మా కంపెనీకి చెందిన ప్రైవేట్ మినీ బస్సు బోల్తా పడింది. కూకట్‌పల్లి నుండి గడ్డపోతారం వెళ్తుండగా, బాచుపల్లి సమీపంలో మలుపు వద్ద బస్సు నియంత్రణ కోల్పోయి ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో బస్సులోని పది మంది ఉద్యోగులకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారందరినీ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
