Miss World Finale | హ్యాండ్లూమ్ వస్త్రాలతో మెరిసిన అందాల భామలు !

పోచంపల్లి చేనేతకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన మిస్ వరల్డ్ పోటీలో భాగంగా నిర్వహించిన ఫ్యాషన్ ఫినాలే కార్యక్రమంలో, పోచంపల్లి హ్యాండ్లూమ్ వస్త్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

వివిధ దేశాల నుంచి వచ్చిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్.. ఈ చేనేత వస్త్రాలను ధరించి ర్యాంప్ వాక్ చేస్తూ మైమ‌రిపించారు. ముఖ్యంగా అమెరికా, కరేబియన్ దేశాల ప్రతినిధులు పోచంపల్లి చేనేత సౌందర్యాన్ని చాటుతూ ఆకట్టుకునేలా ర్యాంప్ వాక్ చేశారు.

ఈ కార్యక్రమం ద్వారా భారతీయ హ్యాండ్లూమ్ కళకు గౌరవం లభించడంతో పాటు, పోచంపల్లి కి అంతర్జాతీయ ఖ్యాతి మరింత పెరిగింది.

Leave a Reply