minors | వేడుకల్లో నిబంధనలు పాటించాలి…
- సీపీ అంబర్ కిశోర్ ఝా
minors | జన్నారం, ఆంధ్రప్రభ : పాత సంవత్సరంకు వీడ్కోలు పలుకుతూ 31 వేడుకల్లో ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్(Police station)ను వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం రాత్రి 8 గంటలకు ఆయన తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా రిజిస్టర్లను పరిశీలించి, పోలీసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసులు ఎప్పటికప్పుడు కొత్త ఒరవడితో అప్రమత్తంగా ఉండి, నేర పరిశోధనలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

31 వేడుకలు అంటూ అతిగా మద్యం తాగి వాహనాలు నడపకూడదని ఆయన చెప్పారు. మైనర్ల(minors)కు వాహన ఇవ్వకూడదని, ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళ్లకూడదని నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకొని ఉన్నట్లు ఆయన తెలిపారు. రాత్రి తర్వాత మద్యం సేవించి రోడ్లపై నినాదాలు చేస్తూ, ఇతరులకు భంగం కలిగించకూడదని ఆయన చెప్పారు. ఈనెల 31అర్ధరాత్రి తర్వాత తమ పోలీసుల గస్తీ ముమ్మరంగా చేస్తారని, అతిగా తాగి నిబంధనల అతిక్రమించిన వారిపై తమ పోలీసులు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీపీ ప్రకాష్,లక్షేట్టిపేట సీఐ రమణమూర్తి,స్థానిక ఎస్సై గొల్లపల్లి అనూష,ఏఎస్సై శ్రీనివాస్ పాల్గొన్నారు.

