వినతి పత్రం సమర్పించిన మైనారిటీలు…
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని వాక్ఫ్ బోర్డు(Wakf Board వ్యవసాయ భూములు కాపాడాలని నారాయణపేట రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనుకు ఈ రోజు ప్రజావాణిలో జామియా పంచ్ మజీద్ అధ్యక్షుడు ఇబాదూర్ రెహమాన్(Ibadur Rahman) ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు.
ఊట్కూర్ మండల కేంద్రం శివారులోని సర్వేనెంబర్ 175,176ఏ, 177అ అ, 178ఏ, 181అ, 181ఏఏ, 182ఏ సర్వే నంబర్ల ఇనాం భూములకు ఓ ఆర్ సీ ఇవ్వద్దని వినతి పత్రంలో పేర్కొన్నారు. వాక్ఫ్ గెజిట్(Waqf Gazette)లో ఉన్న సర్వే నంబర్ల పై కొందరు అక్రమంగా ఓ ఆర్ సీ తీసుకుంటున్న వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఓ ఆర్ సీ నిలుపుదల చేసి వాక్ఫ్ భూములు పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జామియా పంచ్ మజీద్ కమిటీ సభ్యులు షేక్ సమీ, పోర్ల రఫీ, వికార్ యూనుస్, మమ్మద్ పాషా(Mammad Pasha) తదితరులు పాల్గొన్నారు.

