ప్రజా కోర్టులో మంత్రి వివేక్‌కు శిక్ష తప్పదు

ప్రజా కోర్టులో మంత్రి వివేక్‌కు శిక్ష తప్పదు
చెన్నూర్ ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజక వర్గ మాజీ ఎమ్మెలే బాల్క సుమన్ పై అక్రమ కేసులు బనాయించిన మంత్రి వివేక్‌కు ప్రజాకోర్టు లో శిక్ష తప్పదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఇవాళ స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ మెజార్టీ సభ్యులు లేకున్నా క్యాతనపల్లి మున్సిపల్ పీఠం చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల తీర్పు మేరకు చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయించాలన్న సుమన్ పై పోలీసు అధికార బలంతో నియత్రించే ప్రయత్నాలు చేసి మెజార్టీ సభ్యులు లేని కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి వివేక్ చేస్తున్న దౌర్జన్యాలను నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని, భవిష్యత్ లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
