MBNR | నూతన గృహ ప్రవేశం చేసిన మంత్రి శ్రీహరి

మక్తల్, జూన్ 12 (ఆంధ్రప్రభ) : తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్య్స శాఖ, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి డా. వాకిటి శ్రీహరి (Dr. Vakiti Srihari) ఇవాళ మినిస్టర్ క్వార్టర్స్ లో గృహప్రవేశం చేశారు. మంత్రి డా. వాకిటి శ్రీహరి హైదరాబాదు (Hyderabad) లోని మినిస్టర్స్ క్వాటర్స్ లో ప్రభుత్వం కేటాయించిన ఇంటి నెంబర్ 1లో కేటాయించగా, డా.వాకిటి శ్రీహరి, లలిత దంపతులు వేదపండితుల వేదమంత్రోశ్చరణల మధ్య నూతన గృహప్రవేశం (New home entry) చేశారు.

అనంతరం హోమం, వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మక్తల్ నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply