BUILDING | హామీ ఇచ్చిన మంత్రి..

BUILDING | హామీ ఇచ్చిన మంత్రి..

BUILDING | మక్తల్ , ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ముదిరాజుల మత్స్య సహకార సంఘం భవన నిర్మాణానికి మాగనూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి మత్స్య సహకార సంఘం భవన నిర్మాణానికి రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు. శనివారం మాగనూర్ మండలానికి చెందిన మత్య్స సహకార సంఘం సభ్యులు మక్తల్ మంత్రి శ్రీహరిని (Minister Sriharini) కలిసి వినతిపత్రం అందజేశారు. స్పందించిన మంత్రి తక్షణమే మత్య్స సహకార భవనం నిర్మాణం కోసం హామీ ఇచ్చారు. త్వరలో శంకుస్థాపన చేసి పూర్తి చేసి ముఖ్యమంత్రి లేదా, మంత్రులను తీసుకు వచ్చి ప్రారంభం చేయిస్తానని మంత్రి తెలిపారు. మంత్రిని కలిసి వినతిపత్రం అందజేసిన వారిలో మాగనూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆనంద్ గౌడ్, మాగనూర్ మత్స్య సహకార సంఘం అధ్యక్షులు పూంజనూర్ ఆంజనేయలు, ఉపాధ్యక్షులు దండు ఆనంద్ , ప్రధాన కార్యదర్శి గడ్డం నరేష్ , సంఘం డైరెక్టర్ దండు బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply