సుబ్బారాయుడి కుటుంబానికి మంత్రి లోకేష్ ప‌రామ‌ర్శ‌

సుబ్బారాయుడి కుటుంబానికి మంత్రి లోకేష్ ప‌రామ‌ర్శ‌

నెల్లూరు ప్రతినిధి ఆంధ్రప్రభ : ఏపీ ఆగ్రోస్ కార్పొరేషన్ డెవప్మెంట్(AP Agros Corporation Development) మాజీ చైర్మెన్ దివంగత మాలేపాటి సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఈ రోజు దగదర్తికి చేరుకున్న ఆయనకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి(Vemireddy) ప్రశాంతి రెడ్డిలు స్వాగతం పలికారు.

దివంగత మాలేపాటి సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు. సుబ్బారాయుడు సేవలను స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాలేపాటి కుటుంబంతో వారికున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్(Palla Srinivas), జిల్లా ఇన్చార్జి మంత్రి ఎన్ఎండి ఫరూఖ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ లతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు,టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply