Minister Lokesh | ఏపీకి పెట్టుబ‌డుల‌పై వైసీపీ కుట్ర‌..

Minister Lokesh | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆర్సెలార్‌ మిత్తల్‌ ప్రాజెక్ట్‌ ఉత్తరాంధ్రకు వస్తుందని, భూములు కేటాయించామని మంత్రి లోకేశ్‌ అన్నారు. విశాఖలో రెండో స్టీల్‌ సిటీ నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. ఏపీకి పెట్టుబడులు రాకూడదని వైసీపీ కుట్ర పన్నిందని మంత్రి లోకేశ్‌ అన్నారు. టీసీఎస్‌, కాగ్నిజెంట్‌ వంటి సంస్థలకు భూములు ఇవ్వడం తప్పా? అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రశ్నోత్తరాల సమయం పలు ప్రజా సమస్యలపై చర్చకు వేదికైంది. రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన నుంచి తాగునీటి సమస్యల వరకు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పలు విద్యాసంస్థల్లో వసతుల మెరుగుదల కోసం ఇప్పటికే ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.

త్వరలోనే పనులు పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పుట్టపర్తిలో ట్రిపుల్ ఐటీ (IIIT) ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి కోరగా.. ప్రస్తుతం అటువంటి ప్రతిపాదన లేదని, అయితే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని లోకేశ్ సమాధానమిచ్చారు.

Leave a Reply